కర్ణాటక కాబోయే సీఎం.. డీకే శివకుమార్ ఆస్తులు ఐదేళ్లలో ఎంత పెరిగాయంటే!

  • 2018లో రూ.840 కోట్ల ఆస్తులు చూపిన డీకే శివకుమార్
  • 2023లో రూ.1,400 కోట్లకు పైగా ఆస్తులను ప్రకటించిన డీకే శివకుమార్
  • రూ.263 కోట్ల అప్పును చూపించిన డీకే శివకుమార్
కర్ణాటకలో నాయకత్వ మార్పు చోటుచేసుకుంది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. సిద్ధరామయ్య స్థానంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. శనివారం జరగనున్న సీఎల్పీ సమావేశంలో నూతన శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. ఈ నెల 30న ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది.

ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ ఆస్తుల వివరాలు తెలుసుకుందాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తన అఫిడవిట్‌లో రూ.1,400 కోట్లకు పైగా ఆస్తులను ప్రకటించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన రూ.840 కోట్ల ఆస్తులతో పోలిస్తే 2023 నాటికి భారీగా పెరిగాయి.

ఆయన కుటుంబం పేరు మీద రూ.273.42 కోట్ల విలువైన చరాస్తులు, రూ.1,140.36 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. డీకే శివకుమార్ వ్యక్తిగత స్థిరాస్తుల విలువ రూ.972.65 కోట్లుగా ఉంది. తనకు రూ.263 కోట్ల అప్పు ఉందని డీకే శివకుమార్ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తనపై 19 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు.

DK Shivakumar
Karnataka CM
DK Shivakumar assets
Karnataka politics
Siddaramaiah
CLP meeting

More Telugu News